Sat Feb 07 2026 09:49:48 GMT+0530 (India Standard Time)
Trade Deal : భారత్ - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు
భారత్ - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయింది.

భారత్ - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయింది. మధ్యంతర ఒప్పందాన్ని కుదిరినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. రష్యా నుంచి చమురును ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గాని దిగుమతి చేసుకోబోమని భారత్ హామీ ఇచ్చిందని అమెరికా ప్రకటించింది. ఈ హామీ నేపథ్యంలో భారత వస్తువులపై విధించిన అదనపు 25 శాతం సుంకాలను ఫిబ్రవరి 7 నుంచి ఎత్తివేస్తామని తెలిపింది.వైట్‌హౌస్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ప్రకారం, వచ్చే పదేళ్లలో అమెరికాతో రక్షణ రంగ సహకారాన్ని విస్తరించే విధానానికి కూడా భారత్ అంగీకరించింది.
ఇరవై శాతం సుంకం తగ్గింపునకు...
2026 ఫిబ్రవరి 7న తూర్పు అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 12.01 గంటల తర్వాత వినియోగానికి ప్రవేశించే లేదా గిడ్డంగుల నుంచి విడుదలయ్యే భారత ఉత్పత్తులపై, కార్యనిర్వాహక ఉత్తర్వు 14329 ప్రకారం విధించిన అదనపు 25 శాతం అడ్వలోరం సుంకం ఇక వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో రష్యా ముడిచమురు కొనుగోళ్ల కారణంగా భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా 25 శాతం ప్రతిస్పందన సుంకాలు, అదనంగా మరో 25 శాతం లెవీ విధించింది.అమెరికా నుంచి ఐదు వందల బిలియన్ డార్లు విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించిందని పేర్కొంది. రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరినట్లు భారత్ నుంచి కూడా ప్రకటన విడుదలయింది.
ఇరుదేశాల ప్రకటనలు...
భవిష్యత్తులో భారత్ మళ్లీ రష్యా చమురును ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దిగుమతి చేసుకుంటున్నట్టు వాణిజ్య శాఖ కార్యదర్శి గుర్తిస్తే, భారత్‌పై మరోసారి చర్యలు తీసుకోవాలా? అదనపు 25 శాతం సుంకాన్ని తిరిగి విధించాలా? అన్న అంశాలపై సిఫారసు చేస్తామని ఆ కార్యనిర్వాహక ఉత్తర్వులో పేర్కొన్నారు. భారత్ ఉత్పత్తులపై సుంకాన్ని యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించినట్లు ప్రకటించింది. తమ దేశం నుంచి భారత్ భారీగా ఇంధనం, గ్యాస్ ను భారత్ దిగుమతి చేసుకోనుందని చెప్పారు. రక్షణ సహకారాన్ని పదేళ్లకు విస్తరించే ఒప్పందం కుదిరింది.
Next Story

