Sun Feb 08 2026 23:24:19 GMT+0530 (India Standard Time)
జోబైడెన్ కు మళ్లీ కరోనా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు మరోసారి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు మరోసారి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైట్ హౌస్ లోనే ఆయన హోం ఐసొలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అంతకు ముందు జో బైడెన్ కరోనా బారిన పడ్డారు. ఆయన వైరస్ కు సంబంధించి బూస్టర్ డోస్ ను కూడా తీసుకున్నారని ఆయన వ్యక్తిగత వైద్యులు తెలిపారు. అయినా రెండో సారి ఆయనకు కరోనా సోకింది.
ఎటువంటి లక్షణాలు...
కొంచెం నలతగా ఉండటంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎటువంటి లక్షణాలు లేవు. దీంతో కరోనా పాజిటివ్ గా నిర్థారణ కావడంతో ఆయనను ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఐదు రోజుల పాటు ఐసొలేషన్ లో ఉండి బైడెన్ చికిత్స తీసుకుంటారని వైట్‌హౌస్ వైద్యులు చెప్పారు. అరుదుగా వైరస్ తిరగబెడుతుందని, అందుకే వెంటనే రెండోసారి ఆయనకు అటాక్ అయిందని వైద్యులు అంటున్నారు.
Next Story

