Sun Apr 05 2026 19:12:24 GMT+0530 (India Standard Time)
Donald Trump : కుడితిలో పడ్డ ఎలుక ట్రంప్ .. అగ్రరాజ్యమా.. హతవిధీ
ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన యుద్ధం ముహూర్తం బాగాలేనట్లుంది

ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన యుద్ధం ముహూర్తం బాగాలేనట్లుంది. అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికాకు చిన్న దేశమైన ఇరాన్ ను కట్టడి చేసేందుకు ఆరు వారాల సమయం పట్టింది. ఒకవైపు రష్యా కూడా సంవత్సరాల తరబడి ఉక్రెయిన్ పై యుద్ధం కొనసాగిస్తూ ఎంతో నష్టాన్ని చవి చూసింది. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి కూడా కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. యుద్ధం కొనసాగించలేరు. అలాగని ముగించలేరు. ఎందుకంటే ఎక్కువ కాలం యుద్ధాన్ని కొనసాగిస్తే అమెరికాకు భారీ ఆర్థిక నష్టం చేకూరుతుంది.
సూపర్ పవర్ స్టేటస్ కే మోసం...
అదే యుద్ధాన్ని ఆపేస్తే దీర్ఘకాలిక ప్రతిపాదికన నష్టం చేకూరుతుంది. సూపర్ పవర్ అనే స్టేటస్ పోతుంది. ఇప్పటికే అగ్రరాజ్యం అంటే అలుసు ఏర్పడింది. ఇప్పటి వరకూ గుప్పెట మూసి ఉన్నట్లున్న పెద్దన్న పరిస్థితి ఇప్పుడు ఓపెన్ అయింది. పెట్రో కొనుగోలు డాలర్ మార్గంలో కాకుండా ఇతర కరెన్సీ ల ద్వారా మొదలయితే దేశం దివాళా తీసే ప్రమాదం ఏర్పడింది. ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని మట్టుబెడితే బలహీన పడి లొంగిపోతుందని, ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని భావించాడు. కానీ సీన్ రివర్స్ అయింది. నలభై మంది ఇరాన్ అగ్రనేతలను చంపేసినా ఆ దేశం మాత్రం తగ్గడం లేదు. పైగా ఎదురు దాడి చేస్తుంది.
ట్రంప్ నకు వ్యతిరేకంగా...
దీంతో ట్రంప్ అటు యుద్ధాన్ని ఆపలేక.. ఇటు కొనసాగించలేక అల్లాడిపోతున్నాడు. మరొకవైపు అమెరికాలో యుద్ధానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో అన్ని ధరలు పెరిగిపోయాయి. ఆర్థికంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. ట్రంప్ తగ్గాలనుకున్నా ఇప్పుడు ఆయన చేతుల్లో లేకుండా పోయింది. పెట్రోలు నుంచి అన్ని ధరలు పెరిగిపోవడంతో ప్రజలు ట్రంప్ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ గల్ఫ్ దేశాలలోని అమెరికన్ స్థావరాలను నాశనం చేస్తోంది .ఇరాన్ లో తిరుగుబాటు వస్తుంది అనుకొంటే అది కాస్త అమెరికా లో వచ్చింది . కోటి మంది దాక ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ రోడ్ల పైకి వచ్చారు .
మిత్ర దేశాలను కూడా తూలనాడుతూ...
ట్రంప్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. అన్ని దేశాలపై మండిపడుతున్నాడు. ఎన్నో ఏళ్లుగా అమెరికా సింహంపై స్వారీ చేస్తుంది. సింహం నుంచి కిందకు దిగితే అది చంపేస్తుంది.మేక్ అమెరికా గ్రేట్ అగైన్ .. అనేది ట్రంప్ నినాదం. ఆ నినాదం లోనే ఇప్పుడు అమెరికా పరిస్థితి బాగాలేదు అని ధ్వనిస్తుంది . ఏ అమెరికన్ల కోసం ట్రంప్ ఇవన్నీ చేస్తున్నాడో.. వారే ఆతని పై తిరుగుబాటు చెయ్యడం విశేషం. ఇరాన్ లో నేల యుద్ధం చేయడమంటే పద్మ వ్యూహం లోకి వెళ్లడమే .ఆ ప్రయత్నం చేయబోయి వెనక్కు తగ్గాడు. అందుకే హోర్ముజ్ జలసంధిని తెరిపించడం తన పని కాదు .. మీరే చేసుకోండి అని నాటో దేశాలకు చెప్పేశాడు .మిత్ర రాజ్యాలయిన నాటో దేశాలను దూరం చేసుకొన్నాడు. రెండు రోజుల్లో ఏం జరగనుందో... ఊహించుకోవడానికే కష్టంగా మారింది.
Next Story

