Fri Dec 05 2025 09:53:27 GMT+0000 (Coordinated Universal Time)
Nepal : నేపాల్ లో ఆగని హింసం... మరో శ్రీలంకలా నేపాల్
నేపాల్ లో ఆందోళనలు ఆగడం లేదు. ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు.

నేపాల్ లో ఆందోళనలు ఆగడం లేదు. ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసినప్పటికీ ఆందోళనలకు మాత్రం తెరపడలేదు. పందొమ్మిది మంది మరణించడంతో దానిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయినా ఆందోళనకారులు ఇప్పటికీ నేపాల్ లో వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ దేశాన్ని వీడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. ఆయన దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నేపాల్ లో మరో శ్రీలంక దృశ్యం నెలకొంది.
నిన్నటి నుంచి ప్రారంభమై...
నిన్నటి నుంచి మొదలయిన ఆందోళనలు ఇంకా ఆగడం లేదు. మాజీ ఉప ప్రధాన మంత్రి రఘువీర్ మహాసేత్ నివాసంపై నిరసనకారులు రాళ్లు రువ్వుతున్నారు. దీంతో నేపాల్ లో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే మంత్రులు రాజీనామా చేయడంతో ప్రధాని కూడా రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే నేపాల్ లో ఆందో్ళనలు తీవ్రమైన నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. అయితే నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా నివాసాన్ని చుట్టుముట్టి ఆయన ఆస్తులకు ఆందోళన కారులు నిప్పుపెట్టారు.
అత్యవసరంగా అఖిలపక్షం...
ఆందోళనకారులు కేపీ ఓలీ ప్రభుత్వం దిగిపోవాలన్న ప్రధాన డిమాండ్ గా వీధుల్లోకి వస్తున్నారు. వారిని అదుపు చేయడం సైన్యం, పోలీసులకు కూడా కష్టంగా మారింది. అనేక ప్రభుత్వ ఆస్తులకు నిప్పంటించారు. కొన్ని ప్రజా ప్రతినిధుల ఆస్తులను కూడా తగులపెట్టారు. దీంతో ఎవరూ అదుపులేని పరిస్థితిలో నేపాల్ చేరుకుంది. ప్రధాని ఓలీ నివాసం వద్దకు కూడా ఆందోళనకారులు చేరుకున్నారు. దీంతో అక్కడికి రాకుండా పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. నేపాల్ దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ నివాసానికి ఆందోళన కారులు నిప్పు పెట్టారు. ప్రధాని ఓలి దుబాయ్ కు వెళ్లేందుక విమానాన్ని కూడా సిద్ధం చేసుకోవడంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోతారంటున్నారు. అయితే జరుగుతున్న ఆందోళనలపై ఈరోజు సాయంత్రం అఖిలపక్ష సమావేశాన్ని ఓలి నిర్వహిస్తున్నారు.
Next Story

