Fri Dec 05 2025 13:57:05 GMT+0000 (Coordinated Universal Time)
Aeroplane Tyres: విమానం ఆకాశంలోకి ఎగరగానే.. టైర్ రాలిపోయింది
శాన్ ఫ్రాన్సిస్కో నుండి టేకాఫ్ అవుతుండగా టైర్ కిందకు పడిపోవడంతో జపాన్‌కు వెళ్లే

Aeroplane Tyres:శాన్ ఫ్రాన్సిస్కో నుండి టేకాఫ్ అవుతుండగా టైర్ కిందకు పడిపోవడంతో జపాన్‌కు వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ జెట్‌లైనర్ గురువారం లాస్ ఏంజెల్స్‌లో ల్యాండ్ అయింది. 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం ఎడమ వైపు ప్రధాన ల్యాండింగ్ గేర్ అసెంబ్లీలో ఆరు టైర్లలో ఒకటి కోల్పోయింది. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే విమానం టైర్లో ఒకదాన్ని పోగొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు, అయినప్పటికీ శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలోని పార్కింగ్ స్థలంలో టైర్ వచ్చి పడింది. అక్కడ కారు అద్దం పగిలిపోయేలా చేసింది. ఈ సంఘటన జరిగిన వెంటనే.. అక్కడ బోయింగ్ 777 ల్యాండింగ్ విషయంలో సమస్యలు వచ్చాయి. రన్‌వేలో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ విమానాన్ని లాక్కెళ్లాల్సి వచ్చింది.
2002లో నిర్మించిన ఈ విమానం పాడైపోయిన టైర్లతో కూడా సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా రూపొందించినట్లు ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి తరలించనున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తదుపరి విచారణ జరుపుతూ ఉంది.
Next Story

