Fri Dec 05 2025 09:57:28 GMT+0000 (Coordinated Universal Time)
రెండు పడవ ప్రమాదాలు.. 193 మంది మృతి
కాంగోలో రెండు పడవ ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో మొత్తం193 మంది మృతి చెందారు

కాంగోలో రెండు పడవ ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో మొత్తం193 మంది మృతి చెందారు. గురువారం సాయంత్రం లుకోలెలా వద్ద కాంగో నదిలో 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మంటల్లో చిక్కుకుని బోల్తాపడింది. ఈ ఘటనలో 107 మంది మృతి చెందారు. పడవ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ పడవలో ఎక్కువ మంది విద్యార్థులున్నారని తెలిసింది.
సామర్థ్యానికి మించి...
సామర్ధ్యానికి మించి పడవలో ఎక్కడం వల్లనే పడవ బోల్తాపడిందని చెబుతున్నారు.పడవలో మంటలు చెలరేగడంతో పాటు ఓడలోకి భారీగా వరద నీరు చేరడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈక్వెటార్ ప్రావిన్స్‌లో జరిగిన మరో ప్రమాదంలో పడవ బోల్తాపడి 86 మంది మృతి చెందారు. రెండు పడవ ప్రమాదాల్లో 193 మంది మరణించారు. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story

