Israel - Iran War :ఇజ్రాయెల్, అమెరికా దాడులు… గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్‌మీడియాలో చేసిన పోస్టులో ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్‌మీడియాలో చేసిన పోస్టులో ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యుద్ధం ముగించే ఒప్పందం త్వరలో కుదరకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, చమురు బావులు, ఖార్గ్ దీవి చమురు ఎగుమతి కేంద్రం, అవసరమైతే తాగునీరు అందించే ఉప్పునీరు శుద్ధి కేంద్రాలపై కూడా దాడులు విస్తరిస్తామని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధి వెంటనే తెరవాలని, లేకపోతే సైనిక చర్యలు పెంచుతామని చెప్పారు. ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగించింది. కువైట్‌లోని నీరు–విద్యుత్ కేంద్రంపై క్షిపణి దాడి జరిగింది. ఒక కార్మికుడు మరణించగా, పది మంది సైనికులు గాయపడ్డారని కువైట్ వార్తా సంస్థ తెలిపింది. దుబాయ్ సముద్ర జలాల్లో కువైట్‌కు చెందిన చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరగడంతో అగ్ని చెలరేగింది. అదుపు చర్యలు కొనసాగుతున్నాయని దుబాయ్ మీడియా కార్యాలయం వెల్లడించింది.

