Iran - Israel War : ఇరాన్ యుద్ధం ప్రభావంతో చమురు ధరల పెరుగుదలపై ఆందోళన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల చివరలో జరగాల్సిన చైనా పర్యటన వాయిదా పడే అవకాశం ఉందని సూచించారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల చివరలో జరగాల్సిన చైనా పర్యటన వాయిదా పడే అవకాశం ఉందని సూచించారు. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు భారీగా పెరగడంతో, హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మళ్లీ సజావుగా సాగేందుకు చైనా సహకారం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. చైనా ముందుగా సహకారం ప్రకటిస్తుందా అనే విషయం తెలిసిన తర్వాతే పర్యటనపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆదివారం ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యం నుంచి వచ్చే చమురుపై చైనా ఎక్కువగా ఆధారపడుతుందని ఆయన గుర్తుచేశారు. అందువల్ల హార్ముజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్ల రాకపోకలు మళ్లీ ప్రారంభం కావాలంటే తాను ఏర్పాటు చేస్తున్న కొత్త అంతర్జాతీయ కూటమికి చైనా తోడ్పాటు ఇవ్వాలని కోరారు.“పర్యటనకు ముందే చైనా సహకరిస్తుందా తెలుసుకోవాలని ఉంది. అవసరమైతే పర్యటన వాయిదా పడవచ్చు” అని ట్రంప్ చెప్పారు.

