Tue Jan 13 2026 03:47:02 GMT+0000 (Coordinated Universal Time)
Iran : ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలకు ట్రంప్ భారీ షాక్
ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు.

ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. ఇరాన్ తో వ్యాపార సంబంధాలున్న దేశాలపై కూడా మరొకసారి టారిఫ్ పిడుగు వేశారు.ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశంపైనా 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్లో జరుగుతున్న నిరసనలపై అక్కడి ప్రభుత్వం హింసాత్మకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, తేహ్రాన్‌పై ఒత్తిడి పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. ఈ నిర్ణయంవెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. నిరసనలపై అణచివేతకు వ్యతిరేకంగా ఒత్తిడి పెంపుదలలో భాగంగానే ఈ చర్యలని తెలిపారు.
ఇరవై ఐదు శాతం...
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశమైనా అమెరికాతో చేసే అన్ని లావాదేవీలపై 25 శాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ఇదే తుది నిర్ణయంఅని ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో తెలిపారు. ఆర్థిక డేటాబేస్ ‘ట్రేడింగ్ ఎకనామిక్స్’ వివరాల ప్రకారం, ఇరాన్‌కు ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్ ఉన్నాయి. ఈ టారిఫ్ ప్రకటన, ఇరాన్లో నిరసనలపై సైనిక చర్యలపై కూడా ట్రంప్ ఆలోచిస్తున్న సమయంలో వచ్చింది. మానవ హక్కుల సంఘాలు మరణాల సంఖ్య పెరుగుతున్నట్లు వెల్లడించాయి.
సైనిక చర్యలపై సంకేతాలు
విమాన దాడులు కూడా అనేక ఎంపికల్లో ఒకటని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిట్ సోమవారం చెప్పారు. అయితే, ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ద్వారా ఇరాన్‌తో దౌత్య మార్గం ఇంకా తెరిచి ఉందని తెలిపారు. బహిరంగంగా చెప్పేదానికంటే ప్రైవేట్ చర్చల్లో ఇరాన్ భిన్నమైన ధోరణి చూపుతోందని ఆమె వ్యాఖ్యానించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోయిన ఇరాన్ కు ఇది పిడుగులాంటి వార్త అని చెపపాలి. ప్రజలు పెద్దయెత్తున నిరసనలు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇరాన్ కు ఇబ్బందిగా మారనుంది.
Next Story

