Mon Mar 16 2026 23:23:29 GMT+0530 (India Standard Time)
విషాదం : తొక్కిసలాటలో 80 మంది మృతి
యెమన్ లో జరిగిన తొక్కిసలాటలో విషాదం చోటు చేసుకుంది. ఎనభై మంది వరకూ మరణించారని ప్రాధమిక సమాచారం.

యెమన్ లో జరిగిన తొక్కిసలాటలో విషాదం చోటు చేసుకుంది. ఎనభై మంది వరకూ మరణించారని ప్రాధమిక సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పశ్చిమాసియా దేశమైన యెమన్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. దేశ రాజధాని సనాలోని ఓల్డ్ సిటీలో తొక్కిసలాట జరగడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
వంద మందికి పైగా...
ఈ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక సంస్థ ఆర్థిక సాయాన్ని పంపిణీ చేస్తుండగా జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. డబ్బుల కోసం జరిగిన తొక్కిసలాటలో మృత్యువు ఒడికి చేరుకున్నారు. సరైన నిర్వహణ, నియమాలు పాటించకుండా డబ్బుల పంపిణీని ప్రారంభించిన సంస్థ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Next Story

