Sun Feb 01 2026 20:03:35 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. ఊపిరాడక 22 మంది మృతి
పాకిస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. మంచు కారణంగా దాదాపు 22 మంది మరణించిన సంఘటన వెలుగు చూసింది.

పాకిస్థాన్ లో విషాదం చోటు చేసుకుంది. మంచు కారణంగా దాదాపు 22 మంది మరణించిన సంఘటన వెలుగు చూసింది. పాకిస్థాన్ లో ప్రముఖ హిల్ స్టేషన్ ముర్రీ ఉంది. ఇక్కడ జనవరి మాసంలో ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ముర్రీలో కురిసిన భారీ మంచు కారణంగా అనేక వాహనాలు మంచులో కూరుకుపోయాయి. ఊపిరాడక 22 మంది పర్యాటకులు మరణించారు.
మంచు కురిసి....
మరణించిన వారిలో 9 మంది చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వెయ్యికి పైగా వాహనాలు మంచులోనే కూరుకుపోయి ఉన్నాయని, వాటిని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇస్లామాబాద్ కు 45 కిలో మీటర్ల దూరంలో ముర్రీ ఉంటుంది. వాహానాలు మంచులో కూరుకుపోవడంతో ఊపిరాడక మృతి చెందారని, సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story

