Tue Jan 20 2026 09:28:32 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సంపూర్ణ చంద్రగ్రహణం
ఈరోజు ఈ ఏడాదిలో తొలి గ్రహణం ఏర్పడనుంది. మొదటి చంద్ర గ్రహణం ఈరోజు రాత్రి ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు

ఈరోజు ఈ ఏడాదిలో తొలి గ్రహణం ఏర్పడనుంది. మొదటి చంద్ర గ్రహణం ఈరోజు రాత్రి ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. మార్చి 14వ తేదీన రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని తెలిపారు. హోలీ పండగ రోజునే ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ మనదేశంలో మాత్రం ఈ గ్రహణాన్ని వీక్షించలేమని తెలిపారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాల్లో కనిపిస్తుందని శాస్త్రవేవేత్తలు తెలిపారు.
భారత్ లో మాత్రం...
భారత్ లో ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడలేమని చెబుతున్నారు. సూర్యుడు నుంచి వచ్చే ఎరుపు లేదా నారింజ కిరణాలు భూమిపై నుంచి ప్రయాణం చేయడంతో చంద్రుడి ంగు మారుతుంది. నేడు ఆకాశంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఖగోళంలో జరిగే ఒక కార్యక్రమమే తప్ప మరేమీ కాదని అంటున్నారు. కొన్ని రాశుల వారి మీద దీని ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
Next Story

