Tue Mar 17 2026 08:23:33 GMT+0530 (India Standard Time)
బాంబు పేలుడు.. ముగ్గురు మృతి
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో బాంబు పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారు

పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో బాంబు పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇందులో ఒక జర్నలిస్ట్ కూడా ఉన్నారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ లో వాహనంపై బాంబు దాడి చేయగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో ఎనిమిది మంది వరకూ గాయాలయినట్లు తెలిసింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కారులో వస్తుండగా...
ఖుజ్దూర్ నగర్ శివార్లలో రోడ్డు పక్కన ఈ బాంబు పేలినట్లు పోలీసులు తెలిపారు.ది. కారులో ఉన్న జర్నలిస్ు మౌలానా సిద్ధిఖీతో పాటు ఈ పేలుడులో మరో ఇద్దరు బాటసారులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పేలుడు ఎవరు చేశారన్నది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు పేలుడు ధాటికి ఛిద్రమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

