Thu Dec 18 2025 10:08:14 GMT+0000 (Coordinated Universal Time)
భూకంపాన్ని జయించిన చిన్నారులు
సిరియా, తుర్కియాలలో భూకంపానికి వేలాది మంది మరణించారు. వేల సంఖ్యలో భవనాలు కుప్పకూలిపోయాయి.

సిరియా, తుర్కియాలలో భూకంపానికి వేలాది మంది మరణించారు. వేల సంఖ్యలో భవనాలు కుప్పకూలిపోయాయి. టర్కీ, సిరియాలలో గతంలో ఎన్నడూ లేని విషాదం నెలకొంది. అనేక మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. మంచుతో పాటు తరచూ భూప్రకంపనలు వస్తుండటంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతున్నాయి.
పెద్దలు చనిపోగా...
అయితే శిధిలాల తొలగింపు కార్యక్రమాన్ని సహాయక బృందాలు నిరంతరాయంగా కొనసాగిస్తున్నాయి. ఈ సందర్బంగా మిరాకిల్స్ జరుగుతున్నాయి. చిన్నారులు అనేక మంది ప్రాణాలతో బయటపడుతున్నారు. వృద్ధులు, నడివయస్కులు సజీవ సమాధి కాగా, చిన్నారులు అనేక మంది మాత్రం ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడుతున్నారు. తల్లి దండ్రుల కోసం వారు చేస్తున్న ఆర్తనాదాలు కంటతడిపెట్టిస్తున్నాయి. వారందరినీ సైన్యం సురక్షితంగా ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలను అందిస్తుంది.
- Tags
- earthquake
- kids
Next Story

