Wed Mar 18 2026 22:02:20 GMT+0530 (India Standard Time)
కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
ఇథియాపియాలో కొండచరియలు విరగిపడి పదమూడు మంది మరణించారు

ఇథియాపియాలో కొండచరియలు విరగిపడి పదమూడు మంది మరణించారు. అనేక మంది గల్లంతయ్యారు. ఇథియోపియాలోని వోలాటా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు అనేక మంది గల్లంతయ్యారని చెబుతున్నారు. సహాయక బృందాలు వందల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అనేక మంది గల్లంతు...
చిన్నారులు, మహిళలు ఈ ఘటనలో మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతో వాటి నుంచి తప్పించుకోలేక ప్రజలు శిధిలాల కింద ఉండి ఉంటారని సహాయక బృందాలు అనుమానిస్తున్నాయి.
Next Story

