Thu Mar 19 2026 11:55:31 GMT+0530 (India Standard Time)
విషాదం.. అగ్నిప్రమాదంలో 27 మంది దుర్మరణం
జపాన్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒసాకాలోని ఓ భవనంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో అగ్నిప్రమాదం జరిగింది.

జపాన్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒసాకాలోని ఓ భవనంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. Kitashinchi ఎంటర్ టైన్ మెంట్ ఏరియాలో 8 అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భవనంలోని నాల్గవ అంతస్తులో మంటలు చెలరేగడంతో.. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 70 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు.
ఊపిరి ఆడక...
కాగా.. ఈ ప్రమాదంలో 28 మంది మంటల్లో చిక్కుకోగా.. 27 మంది ఊపిరి ఆడక అక్కడికక్కడే మరణించినట్లు అగ్నిమాపకశాఖ అధికారి తెలిపారు. ఈ భవనంలో ఇంటర్నల్ మెడిసిన్ క్లినిక్, ఇంగ్లీషు పాఠశాల, ఇతర వ్యాపార సంస్థలున్నాయని NHK టెలివిజన్ తెలిపింది. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇంతవరకూ తెలియరాలేదు. ఘటనా స్థలిని పరిశీలించిన ఒసాక పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story

