Fri Feb 14 2025 17:02:18 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ అవుతుండగా హెలికాప్టర్ ను ఢీకొట్టడంతో పోటో మాక్ నదిలో పడిపోయాయి.

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఒక విమానం ల్యాండింగ్ అవుతుండగా హెలికాప్టర్ ను ఢీకొట్టడంతో పోటో మాక్ నదిలో పడిపోయాయి. ప్రమాద సమయంలో విమానంలో అరవై మంది ప్రయాణికులు ఉన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ రోనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అధికారుల సహాయక చర్యలు చేపట్టారు. నదిలో కూలిపోవడంతో ఎక్కువ మంది మరణించే అవకాశముంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నదిలో కూలిపోవడంతో...
అమెరికా కాలమాన ప్రకారం నిన్న రాత్రి 8.30 గంటల ప్రాంతంలో పీఎస్ఏ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్రయాణికుల విమానం కాన్సాస్ లోని విషిటా నుంచి బయలుదురి వాషింగ్టన్ కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రక్షణ శాఖకు చెందిన హెలికాప్టర్ ను ఢీకొట్టడంతో విమానంతో పాటు హెలికాప్టర్ కూడా పోటోమాక్ నదిలో కూలిపోయింది. అయితే ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలేమీ ఇప్పటి వరకూ అందలేదు. నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story