Mon Mar 16 2026 02:07:01 GMT+0530 (India Standard Time)
America : దుండగుడి దుశ్చర్య .. 22 మంది బలి
అమెరికాలో కాల్పులు జరిగాయి. ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది మరణించారు

అమెరికాలో కాల్పులు జరిగాయి. ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో 22 మంది మరణించారు. లెవిస్టన్, మైన్ ప్రాంతాల్లో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇరవై రెండు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పదుల సంఖ్యలో...
కాల్పులు జరుపుతున్న దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఒక్కసారిగా కాల్పులకు తెగపడటంతో ఎవరు చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
Next Story

