Sun Mar 15 2026 13:39:51 GMT+0530 (India Standard Time)
అమెరికాలో కాల్పులు.. ఒకరి పరిస్థితి విషమం
అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. మేరీ ల్యాండ్‌లోని గ్రీన్ బెల్ట్‌లో పార్కులో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మేరీ ల్యాండ్‌లోని గ్రీన్ బెల్ట్‌లోని ఒక పార్కులో దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. స్కూల్ విద్యార్థులు పార్క్ లో ఉండగా అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.
నిందితుడి కోసం...
కాల్పులు జరిగిన సమాచారం వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎవరు ఈ కాల్పులకు తెగబడ్డారు? ఎందుకు? అన్న కారణాలు మాత్రం తెలియరాలేదు. నిందితుడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. అమెరికాలో తరచూ కాల్పులు చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతుంది.
Next Story

