Sun Mar 08 2026 03:12:54 GMT+0530 (India Standard Time)
దక్షిణ కొరియాలో భారీ అగ్ని ప్రమాదం.. ఇరవై మంది మృతి
దక్షిణ కొరియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరవై మంది మరణించారు

దక్షిణ కొరియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరవై మంది మరణించారు. దక్షిణ కొరియాలోని బ్యాటరీ ప్లాంట్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఇరవై మంది చనిపోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. బ్యాటరీ సెల్స్ పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. వరసగా బ్యాటరీ సెల్స్ పేలి ఇంత పెద్దయెత్తున ప్రాణనష్టం జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ కు దక్షిణంగా ఉణ్న హ్యాసోంగ్ లోని బ్యాటరీ తయారీ కేంద్రంలో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.
ప్రమాదం జరిగిన సమయంలో...
ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో వంద మంది వరకూ కార్మికులున్నారు. వీరిలో 75 మంది వరకూ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. మిగిలిన వారిలో ఇరవై మంది మరణించారు. సహాయక చర్యలు వెంటనే చేపట్టిన సిబ్బంది లోపల చిక్కుకుపోయిన కార్మికులను రక్షించగలిగారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story

