Mon Dec 08 2025 09:57:50 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో మళ్లీ కాల్పులు... ముగ్గురి మృతి
అమెరికాలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

అమెరికాలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఈ విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకలకు హాజరైన కొందరు కాల్పులు జరిపారు. ఈ ఘటన మిసిసిపీ గల్ఫ్ పోర్టులో జరిగింది. కాల్పులు శబ్దం వినపడటంతో ఒక్కసారిగా జనం బయటకు పరుగులు తీశారు. కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
బాలుడు కూడా....
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కాల్పులు ఘటన జరిగిన వెంటనే అక్కడ పోలీసులు చేరుకుని దుండగుల కోసం వెతుకులాట ప్రారంభించినా ప్రయోజనం లేకుండా పోయింది. కానీ అప్పటికే వారు అక్కడి నుంచి పారిపోయారు. చనిపోయిన వారిలో 11 ఏళ్ల బాలుడు కూడా ఉండటం అక్కడి వారికి కన్నీళ్లు తెప్పించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం వేట ప్రారంభించారు.
Next Story

