Thu Feb 05 2026 18:38:31 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి
పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. ఒక బస్సు వేగంగా వెళుతూ లోయలో పడింది

పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించారు. ఒక బస్సు వేగంగా వెళుతూ లోయలో పడింది. బలూచిస్థాన్ రాష్ట్రంలోని క్వెట్టా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్వెట్టా సమీపానాకి చేరుకోగానే మలుపు వద్ లోయలో పడిపోయింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే చనిపోగా, మరో 11 మంది తీవ్రగాయాలపాలయ్యారు.
మృతుల సంఖ్య....
గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. క్వెట్టా సమీపానికి చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని, ప్రమాదానికి వేగమే కారణమని పోలీసు అధికారులు తెలిపారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Next Story

