Fri Dec 05 2025 12:40:17 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికాలో కొత్త పార్టీ.. మస్క్ vs ట్రంప్ మధ్య విభేదాలతోనేనా?
అమెరికాలో కొత్త పార్టీని స్థాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ది అమెరికా పార్టీ అని కూడా పేరు పెట్టారు

అమెరికాలో కొత్త పార్టీని స్థాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ది అమెరికా పార్టీ అని కూడా పేరు పెట్టారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ మేరకు ఈ పేరును ఎక్స్ లో పోస్టు చేశారు. అంతటితో ఆగకుండా అమెరికాలో కొత్త పార్టీ అవసరంపై అమెరికా ప్రజల నుంచి పోల్ ను కూడా నిర్వహించారు. ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ పోల్ లో ఎనభై శాతం మంది అమెరికాలో కొత్త పార్టీ అవసరమని అభిప్రాయపడ్డారని ఎలాన్ మస్క్ తెలిపారు. అమెరికాలో కొన్ని దశాబ్దాలుగా రిపబ్లికన్లు, డెమోక్రాట్లు మాత్రమే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎవరు అమెరికా అధ్యక్షుడయినా ఈ రెండు పార్టీల నుంచి అవుతున్నారు. అయితే ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ది అమెరికా అనే కొత్త పార్టీని పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.
ఇద్దరి మధ్య విభేదాలతో...
అయితే కొత్త పార్టీకి ఎవరు సారథ్యం వహిస్తారన్నది తెలియకపోయినా కొన్ని రోజుల నుంచి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ల మధ్య విభేదాలు తలెత్తాయి. అవి తీవ్ర రూపం దాల్చాయి. మస్క్ కంపెనీలు నష్టపోయేలా ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నారు. ట్రంప్ స్థానంలో జేడీ వాన్స్ ను అధ్యక్షుడిగా పెడితేనే మంచిదని, లేకుంటే అమెరికా కొన్ని నెలల్లోనే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనక తప్పదని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం పనిచేసిన ఎలాన్ మస్క్ ఐదు నెలలు గడవక ముందే ఆయన అప్పగించిన పదవిని వదిలేసి ట్రంప్ పై విమర్శలు చేయడం ప్రారంభించారు. ట్రంప్ నిర్ణయాలపై ధ్వజమెత్తుతున్నారు.
నాడు మిత్రులుగా...
ఒకప్పుడు మిత్రులుగా ఉన్నవారు ఇద్దరూ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. ట్రంప్ కూడా మస్క్ ను ఇరుకునపెట్టడంలో ఏమాత్రం సంకోచించడం లేదు. సుంకాల విషయంలోనూ, యూనివర్సిటీల అంశంలోనూ ట్రంప్ తగ్గడం లేదు. ట్రంప్ ను పచ్చి అబద్ధాల కోరుగా మస్క్ చెప్పడంతో పాటు తాను చేయం చేయకపోతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యే వారు కాదంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ కు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో మస్క్ కు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను, కాంట్రాక్ట్ లను ట్రంప్ నిషేదించారు. దీంతో ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీకి దాదాపు 152 బిలియన్ డాలర్ల సొమ్ము నష్టపోయింది. దీంతో పాటు స్పేస్ ఎక్స్ కాంట్రాక్టులను కూడా రద్దు చేయడంతో కొత్త పార్టీని ట్రంప్ కు వ్యతిరేకంగా ఎలాన్ మస్క్ పెట్టారన్న వార్తలు అమెరికాలో గుప్పుమంటున్నాయి.
Next Story

