Tue Jan 20 2026 13:49:23 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి
బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 38 మంది వరకూ మరణించారు.

బ్రెజిల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 38 మంది వరకూ మరణించారు. మరో పది మందికి పైగా గాయపడ్డారు. బ్రెజిన్ లోని మినాస్ జెరాయిస్ లో గెరైన్ రాష్ట్రంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు, ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది వరకూ ఉన్నారు.
టైరు ఊడిపోవడంతో...
బస్సు టైరు ఊడిపోవడంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో పాటు కొండరాయిని బస్సును ఢీకొట్టడంతో అధిక సంఖ్యలో మరణించారు. అయితే అదే సమయంలో అటువైపు వేగంగా వచ్చిన కారు కూడా బస్సును ఢీకొట్టడంతో కారులో ఉన్న నలుగురు గాయపడ్డారు. అయితే వారికి ప్రాణాపాయం లేదని చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగించి మృతదేహాలను బయటకు తీశారు. ఈ విషాద ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

