Fri Dec 05 2025 20:23:31 GMT+0000 (Coordinated Universal Time)
South Africa : చర్చికి వెళుతుండగా.. లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక బస్సు లోయలో పడి నలభై ఐదు మంది మరణించారు

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక బస్సు లోయలో పడి నలభై ఐదు మంది మరణించారు. దీంతో ఈస్టర్ పండగ వేళ విషాదం నెలకొంది. ప్రయాణికులతో వెళులున్న బస్సు వంతెన పై నుంచి లోయలో పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఎనిమిదేళ్ల బాలిక బయటపడటం విశేషం. బాలిక తప్ప బస్సులో ఉన్న అందరూ మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈస్టర్ పండగ కోసం చర్చికి వెళుతుండగా 165 అడుగుల లోతులో ఈ ఘటన జరిగింది. సహాయక చర్యలు తక్షణమే ప్రారంభించినా ఎవరినీ కాపాడలేకపోయారు.
46 మంది ప్రయాణిస్తుండగా...
నలభై ఆరు మంది ప్రయాణికులతో బోట్స్వానా నుంచి మోరియాకు బయలుదేరిన బస్సు మలపు వద్ద లయలో పడింది. బస్సు డ్రైవర్ తో పాటు అందరూ చనిపోయారు. ఈ ప్రమాదం నుంచి ఒక బాలిక బయటపడగా ఆ బాలిక పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈస్టర్ వీకెండ్ లో వంతెనపై ట్రాఫిక్ ఉంటుందని, జియాన్ చర్చికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఇంకా సహాయక చర్యలు వెంటనే చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. బోట్స్వానా, దక్షిణాఫ్రికా అధ్యక్షులు మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

