Tue Jan 20 2026 11:39:50 GMT+0000 (Coordinated Universal Time)
Malaysia : ఆకాశంలో హెలికాప్టర్లు ఢీ.. పది మంది మృతి
మలేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆకాశంలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. పది మంది సిబ్బంది ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు

మలేసియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గగనతలనంలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. పది మంది సిబ్బంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మలేసియా నావికాదళానికి చెందిన హెలికాప్టర్లు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఒక హెలికాప్టర్ నేలమీదపడిపోగా, మరొక హెలికాప్టర్ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది.
విన్యాసాలు చేస్తుండగా....
ఈ నెల 26న రాయల్ మలేసియన్ దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా మలేసియా నేవీ హెలికాప్టర్లు ట్రయల్ గా గగనతలంలో విన్యాసాలు చేస్తున్నాయి. విన్యాసాలు చేస్తుండగా ఒకదానికి ఒకటి ఎదురుపడి ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై మలేసియా ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
Next Story

