అంతరిక్షంలోకి తెలుగమ్మాయి
అంతరిక్షంలోకి తెలుగమ్మాయి అడుగుపెట్టబోతోంది.

అంతరిక్షంలోకి తెలుగమ్మాయి అడుగుపెట్టబోతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి అంతరిక్షంలోకి వెళ్లబోతోంది. శ్రీనివాస్, పద్మశ్రీల ముద్దుల కుమార్తె జాహ్నవి 16 ఏళ్ల వయసులో ‘ఇస్రో వరల్డ్ స్పేస్ వీక్’లో పాల్గొంది. ఆస్ట్రోనాట్లకు అవసరమని స్కూబా డైవింగ్నీ నేర్చుకుంది. దేశంలోనే పిన్న అడ్వాన్స్డ్ స్కూబా డైవర్‌గా నిలిచింది. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చదివిన జాహ్నవి నాసా పదిరోజుల ప్రోగ్రామ్‌కి ఎంపికైంది. ఆ అవకాశం అందుకున్న తొలి భారతీయురాలు. మిషన్ డైరెక్టర్‌గా మినీ రాకెట్, అండర్ వాటర్ రాకెట్ లాంచ్‌ల్లో భాగమైంది. ఆ తర్వాత 2022లో పోలాండ్‌లో లూనార్ మిషన్‌లో పాల్గొంది. అతిపిన్న అనలాగ్ ఆస్ట్రోనాట్‌గా గుర్తింపు పొందింది జాహ్నవి. అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ ‘టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్’ చేపట్టిన ‘టైటాన్ స్పేస్ మిషన్’కి ఆస్ట్రోనాట్ క్యాండిడేట్‌గా జాహ్నవి ఎంపికైంది. దీనికోసం మూడేళ్లపాటు వ్యోమగామి శిక్షణలో పాల్గొంటుంది. 2029 లో ఆర్బిటర్ స్పేస్ ఫ్లైట్‌లో జాహ్నవి ప్రయాణించనుంది.