Thu Mar 19 2026 02:42:10 GMT+0530 (India Standard Time)
పోలీసుల అదుపులో టెలిగ్రామ్ సీఈవో
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ ను పారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ ను పారిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. లే బోర్గట్ ఎయిర్ పోర్టులో ఆయనను అరెస్ట్ చేశారు. అజర్ బైజాన్ నుంచి ఆయన లే బోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పావెల్ దురోవ్ పై అనేక ఆరోపణలున్నాయి.
డ్రగ్స్ అక్రమ రవాణాతో...
డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు ఛీటింగ్, సైబర్ నేరాల వంటి వాటిని ఆయన ప్రోత్సహించాడని పోలీసులు చెబుతున్నారు. గతంలోనే పావెల్ దురోవ్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. లేెటెస్ట్ గా అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఆయనను కోర్టులో హాజరు పర్చే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఆయనకు భారీగా శిక్ష పడే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.
Next Story

