Sat Dec 27 2025 07:55:56 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాకు డెవిస్ భయం
అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను డెవిన్ అనే భారీ మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది

అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను డెవిన్ అనే భారీ మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. క్రిస్మస్ పండుగ ముగిసిన వెంటనే విరుచుకుపడటంతో ప్రయాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ తుపాను కారణంగా శుక్ర, శనివారాల్లో 1,800కు పైగా విమానాలు రద్దయ్యాయి. 5,900కు పైగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి.
తుపాను ప్రభావంతో...
తుపాను ప్రభావం న్యూయార్క్ నగరంతో పాటు లాంగ్ ఐలాండ్, కనెక్టికట్, పెన్సిల్వేనియా, ఉత్తర న్యూజెర్సీ ప్రాంతాలపై అధికంగా ఉంది. జాతీయ వాతావరణ విభాగం సుమారు 2.3 కోట్ల మందికి వింటర్ స్టార్మ్ హెచ్చరికలు జారీ చేసింది. న్యూయార్క్ నగరంలో 4 నుంచి 8 అంగుళాల మంచు కురుస్తుందని, ఇతర ప్రాంతాలలో అడుగు వరకు హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. తుఫాను ప్రభావం మొదటి ఐదు నుంచి ఏడు గంటల్లోనే అత్యధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు.
Next Story

