Fri Dec 05 2025 09:58:23 GMT+0000 (Coordinated Universal Time)
Neapal : నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి
నేపాల్ లోపరిస్థితులు కొలిక్కి వస్తున్నాయి. మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా వ్యవహరించేందుకు ఆందో్ళన కారులు అంగీకరించారు

నేపాల్ లోపరిస్థితులు కొలిక్కి వస్తున్నాయి. మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా వ్యవహరించేందుకు ఆందో్ళన కారులు అంగీకరించారు. రాజకీయాలతో సంబంధాలు ఉన్నఏ ఒక్కరికీ తిరిగి నేపాల్ నాయకత్వాన్ని అప్పగించేది లేదని ఆందోళనకారులు తెలిపారు. దీంతో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కికి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉండేందుకు అంగీకరించారు.
సాధారణ స్థితికి వచ్చేందుకు...
నేపాల్ లో ప్రస్తుతం ఉన్నపరిస్థితుల నుంచి సాధారణ స్థితికి తీసుకు వచ్చేందుకు మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి కృషి చేయనున్నారు. ఇప్పటికే నేపాల్ లో అధికారంలో ఉన్న మంత్రులు, ప్రధాని రాజీనామాలు చేయడంతో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. దీంతో ఆందోళకారులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడనుంది.
Next Story

