Bangladesh Political Crisis : డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు హసీనా రాక
Dhaka : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగొచ్చేందుకు సిద్ధమయ్యారు

Dhaka : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగొచ్చేందుకు సిద్ధమయ్యారు. భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న ఆమె.. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు వస్తానని మంగళవారం ప్రకటించారు. ఆ రోజునే బంగ్లాదేశ్ విజయ్ దివస్ (విజయ దినోత్సవం) జరుపుకొంటుంది. పాకిస్థాన్‌తో యుద్ధం చేసి స్వాతంత్య్రం సాధించిన సందర్భంగా ఆ దేశం ఏటా ఈ వేడుకలు నిర్వహిస్తుంది.విద్యార్థుల నేతృత్వంలో 2024లో జరిగిన భారీ ఆందోళనలు హసీనా 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికాయి. దీంతో అదే ఏడాది ఆగస్టు 5న ఆమె భారత్‌కు వెళ్లి ఆశ్రయం పొందారు. ఆందోళనల సమయంలో వందలాది మంది నిరసనకారులు హత్యకు గురైన ఘటనలకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ ఆమెకు గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును హసీనా తిరస్కరించారు. స్వదేశానికి తిరిగొచ్చాక కేసులో న్యాయపోరాటం చేస్తానని గతంలోనే చెప్పారు.

