Wed Jan 28 2026 17:28:51 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : పుతిన్ తో నరేంద్ర మోదీ
జిన్‌పింగ్ అధ్యక్షతన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. అయితే ఈ సదస్సుకు ప్రధాని మోదీ, పుతిన్ సహా వివిధ దేశాధినేతలు హాజరయ్యారు.

తియాజ్జిన్ వేదికగా 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. జిన్‌పింగ్ అధ్యక్షతన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. అయితే ఈ సదస్సుకు ప్రధాని మోదీ, పుతిన్ సహా వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. సదస్సు ప్రారంభ సమయంలో పుతిన్‌ను ఆత్మీయంగా ప్రధాని మోదీ పలకరించారు.
ఎస్సీవో సదస్సులో...
షేక్‌హ్యాండ్ ఇచ్చి పుతిన్‌ను ఆలింగనం చేసుకున్న ప్రధాని మోదీ అనంతరం పుతిన్‌ను కలిసిన చిత్రాలను ఎక్స్ ఖాతాలో ప్రధాని మోదీ పంచుకున్నారు.పుతిన్‌ను కలవడం ఆనందంగా ఉందని ఎక్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎస్సీవో సదస్సులో కీలక ప్రసంగం ప్రధాని మోదీ చేయనున్నారు. దీంతో కొత్త స్నేహం ప్రారంభమయిందని అనుకోవచ్చు.
Next Story

