Sat Jan 10 2026 09:28:20 GMT+0000 (Coordinated Universal Time)
చిలీ అడవుల్లో చెలరేగిన మంటలు
చిలీ దేశంలో వరస అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో వందలాది భవనాలు దెబ్బతింటున్నాయి.

చిలీ దేశంలో వరస అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో వందలాది భవనాలు దెబ్బతింటున్నాయి. దేశవ్యాప్తంగా మంటలు చెలరేగుతుండటంతో అగ్నిమాపక యంత్రాలు వాటిని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. చిలీ దేశంలో వేసవి తీవ్రత కారణంగానే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశముందని ప్రభుత్వం పౌరులను హెచ్చరించింది.
పదమూడు మంది మృతి...
ఇప్పటికే అగ్నిప్రమాదాల వల్ల పదమూడు మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. కొందరు గాయాలపాలయ్యారని ప్రభుత్వం చెబుతుంది. మంటలను ఆర్పే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది కూడా మరణించినట్లు ప్రభుత్వం పేర్కొంది. చిలీ అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు పట్టణాలకు వ్యాపిస్తున్నాయి. బయోియోలోని శాంటా జువానా పట్టణ పరిసర ప్రాంతాల్లో మంటలు పెద్ద యెత్తున చెలరేగాయని ప్రభుత్వం తెలిపింది. మొత్తం దేశంలో 151 ప్రాంతాలలో మంటలు చెలరేగగా 65 చోట్ల అదుపులోకి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Next Story

