Sun Oct 06 2024 00:54:17 GMT+0000 (Coordinated Universal Time)
బాణాలతో యుద్ధం.. ఉక్రెయిన్ పై రష్యా
తాజాగా రష్యన్ సైనికులు విల్లంబులతో ఉక్రయిన్ సైనికులపై దాడికి దిగుతున్నారు. ఈరోజుల్లో బాణాలు వాడటం చర్చనీయాంశమైంది
రష్యా - ఉక్రెయిన్ ల యుద్ధం కొన్ని నెలలుగా కొనసాగుతుంది. అన్ని విధాలుగా యుద్ధరీతులను అనుసరిస్తుంది. ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. ఉక్రెయిన్ బలగాలు ఎక్కడకక్కడ అడ్డుకుంటున్నాయి. రష్యా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. రష్యాకు ఈ యుద్ధం కారణంగా ఆర్థికంగా నష్టం జరిగిందన్న అంచనాలోె ఉన్నారు.
విల్లంబులతో...
అయితే తాజాగా రష్యన్ సైనికులు విల్లంబులతో ఉక్రయిన్ సైనికులపై దాడికి దిగుతున్నారు. ఈరోజుల్లో బాణాలు వాడటం చర్చనీయాంశమైంది. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఈ యుద్ధాన్ని విచిత్రంగా చూస్తున్నారు. రష్యా సైనికులు ఒకవైపు మెడకు గన్ తగిలించుకుని మరో వైపు విల్లు, బాణాన్ని ఎక్కుపెట్టి ఉక్రెయిన్ సైనికుల కోసం గాలిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉక్రెయిన్ కూడా ఈ వార్తలను ధృవీకరించడం విశేషం.
- Tags
- russia
Next Story