Mon Feb 02 2026 16:58:20 GMT+0000 (Coordinated Universal Time)
రష్యా యుద్ధనౌకకు భారీ నష్టం
సముద్ర మార్గం ద్వారా భారీ ఎత్తున ఆయుధాలను తరలింపులు చేపట్టింది. రష్యానుంచి ఉక్రెయిన్ కు ఆయుధాలను ..

రష్యా చేస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా ప్రతి ఘటిస్తోన్న ఉక్రెయిన్ పై రష్యా మరింత విరుచుకుపడుతోంది. అందుకు సముద్ర మార్గం ద్వారా భారీ ఎత్తున ఆయుధాలను తరలింపులు చేపట్టింది. రష్యానుంచి ఉక్రెయిన్ కు ఆయుధాలను తరలిస్తున్న నౌకల్లో ఒక నౌక తీవ్రస్థాయిలో దెబ్బతింది. రష్యా యుద్ధనౌకపై తమ బలగాలు మిస్సైల్ ను ప్రయోగించాయని, ఆ నౌకను ధ్వంసం చేసింది తామేనని ఉక్రెయిన్ ప్రకటించింది.
రష్యాకు చెందిన 'మాస్క్వా క్రూజ్' నౌక ఉక్రెయిన్ తీరానికి చేరుకోగానే, తమ దళాలు క్షిపణితో దాడి చేశాయని ఒడెస్సా గవర్నర్ తెలిపారు. కానీ.. రష్యా ఈ ప్రకటనను ఖండించింది. యుద్ధనౌకలో జరిగిన పేలుడు కారణంగానే నష్టం వాటిల్లిందని, నౌకలోని సిబ్బందికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, వారిని సురక్షితంగా వెలుపలికి తరలించినట్టు రష్యా అధికారులు తెలిపారు.
Next Story

