Sun Mar 15 2026 00:18:52 GMT+0530 (India Standard Time)
రష్యా - గోవా విమానానికి బాంబు బెదిరింపు
రష్యా - గోవా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. రష్యా నుంచి 283 మందితో గోవాకు ఈ విమానం బయలుదేరింది

రష్యా - గోవా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. రష్యా నుంచి 283 మందితో బయలుదేరిన ఈ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉజ్జెకిస్తాన్ కు విమానాన్ని దారి మళ్లించారు. బాంబు బెదిరింపు రావడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
ఉజ్బెకిస్థాన్ కు దారి మళ్లింపు...
గోవా వెళ్లాల్సిన విమానం ఉజ్బెకిస్థాన్ కు దారి మళ్లించడంతో ప్రయాణికులు భయపడి పోతున్నారు. ఆందోళనకు గురవుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని విమానయాన సంస్థ చెబుతుంది. బాంబు బెదిరింపుపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. విచారణ తర్వాత, విమానాన్ని తనిఖీ చేసిన అనంతరం తిరిగి గోవాకు తీసుకురానున్నారు.
Next Story

