Fri Sep 13 2024 02:58:05 GMT+0000 (Coordinated Universal Time)
92 ఏళ్ల వయసులో ప్రపంచ మీడియా దిగ్గజం ఐదోపెళ్లి.. పెళ్లికూతురెవరంటే..
తన 66 ఏళ్ల ప్రేయసి ఆన్ లెస్లీ స్మిత్ అనే మహిళను ఐదోవివాహం చేసుకోబోతున్నట్లు తన సొంత వార్తాపత్రికైన న్యూయార్క్..
ప్రపంచ మీడియా దిగ్గజం, ఆస్ట్రేలియన్ అమెరికన్ వ్యాపారవేత్త, బిలియనీర్ అయిన రూపర్ట్ మర్దోక్ 92 ఏళ్ల వయసులో ఐదోపెళ్లికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నలుగురిని పెళ్లాడి.. నలుగురికీ విడాకులిచ్చేసిన ఆయన.. తన 66 ఏళ్ల ప్రేయసి ఆన్ లెస్లీ స్మిత్ అనే మహిళను ఐదోవివాహం చేసుకోబోతున్నట్లు తన సొంత వార్తాపత్రికైన న్యూయార్క్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. వారిద్దరికీ మార్చి 17న ఎంగేజ్ మెంట్ జరిగినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ సమయంలో అది తనకు చివరి పెళ్లి అని, చాలా సంతోషంగా ఉందని మర్దోక్ చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే మర్దోక్ - ఆన్ లెస్లీ స్మిత్ ను వివాహం చేసుకోనున్నారు.
కాగా.. మర్దోక్ మొదట పెట్రిసియా బుకర్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. 1960లో ఆమెకు విడాకులిచ్చి.. అన్నా మరియా మన్ అనే మహిళను రెండోవివాహం చేసుకున్నారు. మరియా ఒక వార్తాపత్రికలో రిపోర్టర్. వీరిద్దరు 30 ఏళ్లకు పైగా వివాహజీవితాన్ని గడిపారు. 1999లో ఆమెకు కూడా విడాకులు ఇచ్చి.. వెండీ డెంగ్ను మూడో పెళ్లి చేసుకున్నారు. 2013లో ఆమెకీ విడాకులు ఇచ్చి.. 2016లో జెర్రీ హాల్ (65)ను నాలుగో వివాహం చేసుకున్న మర్దోక్ గతేడాది ఆగస్టు నెలలో ఆమెకుసైతం విడాకులు ఇచ్చారు. తాజాగా 92ఏళ్ల వయస్సులో తన ప్రియురాలు ఆన్ లెస్లీ స్మిత్ను ఐదో వివాహం చేసుకొనేందుకు మర్దోక్ సిద్ధమయ్యారు. కాగా.. నలుగురు భార్యల్లో రెండో భార్య అయిన మన్కు భారీగా భరణం ఇచ్చినట్లు సమాచారం.
Next Story