Mon Apr 13 2026 14:50:07 GMT+0530 (India Standard Time)
యూకేలో శాశ్వత నివాసం ఇక కష్టమేనా?
యూకేలో శాశ్వత నివాసం కోరే వలసదారులకు నిబంధనలు కఠినతరం కానున్నాయి

యూకేలో శాశ్వత నివాసం కోరే వలసదారులకు నిబంధనలు కఠినతరం కానున్నాయి.ఈ మేరకు ఆ దేశ హోంశాఖ మంత్రి షబానా మహమూద్ ప్రతిపాదనలు చేస్తున్నారు. దీని ప్రకారం.. ‘శాశ్వత నివాస అనుమతి ’ కోసం దరఖాస్తు చేసుకునే కొందరికి గడువును 5 నుంచి 10 ఏళ్లకు పెంచుతున్నారు. మరికొందరికి ఈ వ్యవధిని 20 ఏళ్లకు పెంచుతున్నారు.
నిబంధనలను కూడా...
మరోవైపు అర్హత నిబంధనలు కూడా కఠినతరం చేయనున్నారు. వలసదారులకు నేర చరిత్ర లేకుండా ఉండాలి.గత మూడు సంవత్సరాలుగా ఏటా 12,570 పౌండ్ల కంటే ఎక్కువ ఆర్జిస్తూ ఉండాలనే బంధనలున్నాయి. ఈ నిబంధనలతో యూకేలోనూ శాశ్వత నివాసం కోరుకునే వారికి కొంత నిరాశ ఎదురవుతుందని అంచనాలు వినపడుతున్నాయి.
Next Story

