Iran - America Cease Fire : కాల్పుల విరమణతో దిగివచ్చిన చమురు ధరలు
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించిన తర్వాత చమురు ధరలు తగ్గాయి

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించిన తర్వాత చమురు ధరలు తగ్గాయి. హెర్ముజ్ జలసంధి మళ్లీ తెరవడం సహా అంశాలపై ఇస్లామాబాద్‌లో శుక్రవారం నుంచి అమెరికాతో చర్చలు జరపనున్నట్లు టెహ్రాన్ తెలిపింది. మొదట ఇరాన్ సూచించిన 10 అంశాల ప్రణాళిక అమలు సాధ్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే తర్వాత అదే ప్రణాళిక మోసపూరితమని వ్యాఖ్యానించారు. ఒప్పందానికి ముందు గంటల్లో ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. “ఒప్పందం కుదరకపోతే ఈ రాత్రే ఒక నాగరికత అంతమవుతుంది” అని హెచ్చరించారు. హెర్ముజ్ జలసంధి తెరవడాన్ని ఒప్పందంలో చేర్చాలని కూడా అన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ కార్యాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, ఇరాన్‌పై దాడులను రెండు వారాలు నిలిపివేయాలన్న ట్రంప్ నిర్ణయానికి మద్దతు ప్రకటించింది. అయితే లెబనాన్‌లో హిజ్బుల్లాతో సాగుతున్న యుద్ధానికి ఈ కాల్పుల విరమణ వర్తించదని స్పష్టం చేసింది.

