Fri Mar 20 2026 23:54:46 GMT+0530 (India Standard Time)
అశోక్ గెహ్లాత్ దిగివచ్చారు
రాజస్థాన్ మంత్రి వర్గ విస్తరణ నేడు జరగనుంది. అశోక్ గెహ్లాత్ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు.

రాజస్థాన్ మంత్రి వర్గ విస్తరణ నేడు జరగనుంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. గత కొన్ని రోజులుగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టకుండా అశోక్ గెహ్లాత్ నానుస్తున్నారు. సచిన్ పైలట్ వర్గీయులకు అవకాశం కల్పించాల్సి వస్తుందని ఆయన విస్తరణ విషయంలో జాప్యం చేస్తూ వస్తున్నారు.
నేడు విస్తరణ.....
కానీ కాంగ్రెస్ హైకమాండ్ అశోక్ గెహ్లాత్ కు గట్టిగా సూచించడంతో నేడు మంత్రి వర్గ విస్తరణను అశోక్ గెహ్లాత్ చేపట్టనున్నారు. మొత్తం 12 మందికి విస్తరణలో చోటు కల్పించనున్నారు. ఇందులో ఐదుగురు సచిన్ పైలెట్ వర్గానికి చెందిన వారున్నారని తెలిసింది. హైకమాండ్ జోక్యంతోనే అశోక్ గెహ్లాత్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. నిన్న కొందరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయడంతో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు.
Next Story

