Wed Mar 18 2026 23:56:29 GMT+0530 (India Standard Time)
తిరుమలకు శ్రీలంక ప్రధాని
శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్స నేడు తిరుమలకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన తిరుమలలో బస చేస్తారు

శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్స నేడు తిరుమలకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన తిరుమలలో బస చేస్తారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన నేరుగా కొలొంబో నుంచి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. నేరుగా ఎయిర్ పోర్టు నుంచి తిరుమల చేరుకుని అక్కడ శ్రీకృష్ణ అతిధి గృహంలో మహేంద్ర రాజపక్స బస చేస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
రేపు ఉదయం....
రేపు ఉదయం మహేంద్ర రాజపక్స తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రేపు మధ్యాహ్నం ఆయన తిరిగి శ్రీలంకకు బయలుదేరి వెళ్లనున్నారు. మహేంద్ర రాజపక్స పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story

