Fri Apr 25 2025 09:16:24 GMT+0000 (Coordinated Universal Time)
పుతిన్ బతికే ఉన్నాడా? మాకు తెలియదే
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ బతికి ఉన్నారో? లేదో? తమకు తెలియదన్నారు

ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొన్ని నెలలుగా సాగుతున్న యుద్ధానికి ఇంకా తెరపడలేదు. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. అయినా ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలన్న రష్యా తన ప్రయత్నాలను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో ఉక్రెయిన్ ధీటుగా సమాధానం చెబుతోంది. రష్యా సైన్యం కూడా భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంచలన కామెంట్స్...
రష్యా అధ్యక్షుడు పుతిన్ బతికి ఉన్నారో? లేదో? తమకు తెలియదని జెలెన్ స్కీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. గత కొన్ని వారాల నుంచి పుతిన్ బహిరంగ సమావేశాలకు దూరంగా ఉంటున్నారని ఆయన అన్నారు. శాంతి చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయని అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో జెలెన్ స్కీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
Next Story