Fri Feb 14 2025 17:11:45 GMT+0000 (Coordinated Universal Time)
Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా ఏం చేస్తానంటే?
అగ్రరాజ్యం అమెరికా పేరు ప్రతిష్టలను మరింత పెంచేందుకు కృషి చేస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

అగ్రరాజ్యం అమెరికా పేరు ప్రతిష్టలను మరింత పెంచేందుకు కృషి చేస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అమెరికాలో ఇప్పుడు స్వర్ణయుగం ప్రారంభం కానుందని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసలను అరికడతానని ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు దేశ దక్షిణ సరిహద్దుల్లో ఎమెర్జన్సీ విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. అమెరికా ఇక అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని తెలిపారు. అందరికీ అసూయ కలిగించేలా తాను వ్యవహరిస్తానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతోనే దేశాన్ని ముందుకు తీసుకువెళతామని ప్రజలకు ట్రంప్ హామీ ఇచ్చారు.
ప్రజాస్వామ్యయుతంగా...
రాజ్యాంగ బద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా తాను పాలన సాగిస్తామని చెప్పారు. నేరగాళ్లు దేశంలో ప్రవేశించకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. తీవ్రవాద కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్న ఆయన అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. అత్యున్నత సేవలందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే శాంతిని నెలకొల్పేలా తాను తీసుకునే చర్యలతో అమెరికాకు మరింత పేరు ప్రఖ్యాతులను తెస్తానని తెలిపారు. అమెరికా పౌరులకు మరింతగా వెసులుబాటు కల్పించి వారిని ధనవంతులను చేస్తామని, విదేశాలపై పన్నులను విధిస్తామని ఆయన ప్రమాణం చేసిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ తెలిపారు. బైబిల్ సాక్షిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
కాల్పులు జరగకుండా...
అమెరికా పౌరులు కాని వారికి ఇక్కడ పుట్టే సహజంగా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. విద్యుత్తు వాహనాల తయారీలో అమెరికాను అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు. రెస్టారెంట్లలో కాల్పులు జరగకుండా తాను అన్ని చర్యలు తీసుకుంటానని ట్రంప్ ఈ సందర్భంగా మాట ఇచ్చారు. తమ యంత్రాంగం యావత్తూ అందుకు కృషి చేస్తుందన్న ట్రంప్ అమెరికన్లు ఇబ్బంది పడకుండా చూడటమే తన లక్ష్యమని, అమెరికా అంటే ప్రపంచ దేశాల్లో క్రేజ్ మరింత పెరిగే లా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనపై కూడా అనేక సార్లు హత్యాయత్నాలు జరిగాయని, కానీ దేవుడే కాపాడని అన్న ట్రంప్ శాంతిభద్రతలకు ప్రధమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
Next Story