Fri Dec 05 2025 18:54:04 GMT+0000 (Coordinated Universal Time)
Jyoti Malhotra : ఈ కిలాడి లేడీని అస్సలు వదల కూడదు.. హైదరాబాద్ లోనూ జాడలు
జ్యోతి మల్హోత్రా భారత్ లో ఉంటూ ఐఎస్ఐ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది

భారత్ లో ఉంటూ శత్రుదేశానికి సాయపడేవారిని ఏరిపడేయాలి. వారు ఎవరైనా సరే. మహిళలయినా.. యువకులయినా సరే క్షమించకూడదు. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా భారత్ లో ఉంటూ ఐఎస్ఐ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు ఆమెను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. యూట్యూబర్ గా ఉంటూ పాక్ కు ఇండియా సమాచారం చేరవేయడంలో ఈ కిలాడీ లేడీ మాత్రం ఆరు ఆకులు ఎక్కువే తినింది. హర్యానాలోని హిసార్ కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తన యూట్యూబ్ ఛానెల్ ట్రావెల్ విత్ జో ద్వరా పాకిస్తాన్ కు సీక్రెట్ సమాచారం పంపినట్లు గుర్తించారు.
పహాల్గాం దాడికి ముందు...
ఆమెను అరెస్ట్ చేసి విచారణ జరిపినప్పుడు అనేక సంచలన విషయాలు వెలుగు చూశాయి. హిసార్ ఎస్సీ శశాంక్ కుమార్ సావన్ మీడియాకు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి అనేక విషయాలను వెల్లడించారు. పాకిస్తాన్ కు జ్యోతికి సంబంధాలున్నాయని ఆయన తేల్చి చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. పహాల్గాం దాడి ఘటనకు ముందు అనేక సార్లు పాకిస్తాన్ కు జ్యోతి మల్హోత్రా వెళ్లి వచ్చిన విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరికొందరు యూట్యూబర్లకు సంబంధాలుున్నాయని విచారణలో తేలింది. యూట్యూబ్ ద్వారా వచ్చిన డబ్బులతో పాకిస్తాన్ కు తరచూ జ్యోతి మల్హోత్రా వెళ్లి వచ్చేదని పోలీసులు చెప్పారు.
నేరుగా ఆర్మీతో సంబంధాలు...
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పాక్ ఆర్మీతో నేరుగా సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. భారత్ కు చెందిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు జ్యోతి మల్హోత్రా పాక్ ఆర్మీకి అందించేది. పహాల్గాంలో ఉన్న లోటుపాట్లను కూడా జ్యోతి మల్హోత్రా అక్కడి వారికి వివరించినట్లు బయటపడింది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఇంటలిజెన్స్ ఆపరేటివ్స్ , ఈషాన్ ఉర్ రహీమ్ తో సోషల్ మీడియా లోని అనేక ప్లాట్ ఫారంల ద్వారా సమాచారన్ని ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా ఇలాంటి కిలాడీ లేడీలు ఎంత మంది ఉన్నారన్నది మాత్రం పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ తో భారత్ లో ఉంటూ పాక్ కు సాయం అందించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరిగింది.
హైదరాబాద్ లోనూ జ్యోతికి...
పాకిస్తాన్ కక గూఢచర్యం దొరికిపోయిన జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్ లోనూ కనిపించాయి. 2023 లో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ - బెంగళూరు వందేభారత్ రైలు ప్రారంభించిన సమయంలో జ్యోతి మల్హోత్రా కనిపించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని కొంత హడావిడి చేశారు. ఈ వీడియోలు ఇప్పడు వైరల్ గా మారాయి. నాటి గవర్నర్ తమిళి సై తో పాటుగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పాల్గొన్న కార్యక్రమంలో జ్యోతి మల్హోత్రాపాల్గొన్నారు. యూట్యూబర్ గా అప్పట్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే హైదరాబాద్ లో జ్యోతి మల్హోత్రా ఎవరెవరెవరిని కలిశారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story

