Fri Apr 03 2026 19:20:04 GMT+0530 (India Standard Time)
Petrol Prices : లీటర్ పెట్రోలు 459 రూపాయలు ఎక్కడంటే?
పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి

పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. పాకిస్తాన్ లో భారీగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. యాభై శాతం ధరలు పెరిగడంతో పాకిస్తాన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాకిస్తాన్ లో లీటర్ డీజిల్ పై అయిదు వందల రూపాయలకు చేరుకుంది.
లీటరు డీజిల్ ఐదు వందలకు పైగానే...
అలాగే లీటరు పెట్రోలు ధర 459 రూపాయలుగా ఉంది. దీంతో పాకిస్తాన్ ప్రజలు పెట్రోలు, డీజిల్ కొనలేని పరిస్థితులకు చేరుకున్నారు. పలు చోట్ల ఆందోళనలకు దిగుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ప్రభావం పాకిస్తాన్ పై స్పష్టంగా కనిపిస్తుంది.
Next Story

