Thu Jan 29 2026 05:35:04 GMT+0000 (Coordinated Universal Time)
తిరగబడుతున్న జనం.. రాజపక్సే ప్రాణాలకు ప్రమాదం?
శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే పై లంక ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈరోజు మరోసారి ఆయన ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు

శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే పై లంక ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈరోజు మరోసారి ఆయన ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. కొలొంబోలో ప్రధాన రహదారులన్నింటిపైనా సైన్యాన్ని మొహరించారు. రాజపక్సే ఇంటి సమీపంలోకి ఎవరూ చేరకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల ఆందోళనలతో పార్లమెంటు భవనానికి వెళ్లే దారిలోనూ తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
విదేశాలకు....
రాజపక్సే ప్రధాని పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. రాజపక్సేకు అనుకూలంగా ఒకవర్గం ర్యాలీలు చేేస్తున్నా పెద్దగా ఫలితం లేదు. అయితే రాజపక్సే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ప్రజలు తిరగబడుతున్నందున వారిని ఆపడం ఎవరి వల్ల కాదంటున్నారు. అందుకే రాజపక్సే విదేశాలకు పారిపోయే అవకాశముందని చెబుతున్నారు. శ్రీలంకలో రానున్న కాలంలో మరింత గడ్డు పరిస్థితులు తలెత్తుతాయంటున్నారు. సాయం చేయాలని శ్రీలంక ఇతర దేశాలను కోరుతోంది.
Next Story

