Fri Dec 05 2025 10:52:07 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ లో హిందూ వ్యాపారిపై దారుణం.. దేశం విడిచివెళ్లనందుకు హత్య !
కళ్లు పొడిచారని, కాళ్లు, చేతులపై కత్తితో గాయాలు చేశారని ఆ వీడియోలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ దేశానికి

భారత్ శత్రుదేశమైన పాకిస్థాన్ లో మరో దారుణం జరిగింది. దేశం విడిచి వెళ్లాలని ఓ హిందూ వ్యాపారిని హెచ్చరించగా.. అతను ససేమిరా వెళ్లనని చెప్పడంతో దారుణంగా కాల్చి చంపారు దుండగులు. వివరాల్లోకి వెళ్తే.. సింధు ప్రావిన్స్ లోని ఘోట్కీ జిల్లాకు చెందిన సతన్ లాల్ ను దహర్ సామాజిక వర్గానికి చెందిన కొందరు కొన్నేళ్లుగా బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ఆయనకు ఉన్న భూమిని తమకు అప్పగించి, దేశం విడిచి వెళ్లిపోవాలని బెదిరించారని తెలిపారు.
Also Read : నేటి నుంచి తెలంగాణలో డిజిటల్ క్లాసులు
కళ్లు పొడిచారని, కాళ్లు, చేతులపై కత్తితో గాయాలు చేశారని ఆ వీడియోలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ దేశానికి చెందినవాడినని, చావనైనా చస్తాను కానీ వారికి మాత్రం లొంగేది లేదని స్పష్టం చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టుతో పాటు స్థానిక అధికారులను కూడా వేడుకున్నారు. కానీ.. అంతలోనే ఊహించని దారుణం జరిగింది. సతన్లాల్కు చెందిన భూమిలో ఏర్పాటు చేసిన కాటన్ ఫ్యాక్టరీ, ఫ్లోర్ మిల్ ప్రారంభోత్సవం జరుగుతుండగా వచ్చిన దుండగులు ఆయనను కాల్చి చంపారు. సతన్లాల్ స్నేహితుడు ముఖి అనిల్ కుమార్ను ఉటంకిస్తూ 'ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్' ఈ విషయాన్ని వెల్లడించింది. లాల్ హత్యకు నిరసనగా మంగళవారం ఘోట్కీ జిల్లాలో నిరసనలు చేపట్టారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. మరోవైపు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బచల్ దహార్, అతడి మద్దతుదారులను అరెస్ట్ చేశారు.
Next Story

