Mon Jun 16 2025 12:31:53 GMT+0000 (Coordinated Universal Time)
Pakistan : పాకిస్తాన్ లో పెరుగుతున్న "ప్రత్యేక" ఉద్యమాలు.. పరేషాన్ లో దాయాది
దాయాది దేశం పాకిస్తాన్ అన్ని రకాలుగా సతమతమవుతుంది. వేర్పాటు ఉద్యమాలతో ఇబ్బందులు పడుతుంది

దాయాది దేశం పాకిస్తాన్ అన్ని రకాలుగా సతమతమవుతుంది. వేర్పాటు ఉద్యమాలతో ఇబ్బందులు పడుతుంది. భారత్ సింధూ జలాలను నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్న పాక్ కు తాజాగా మరొక ముప్పు ఏర్పడింది. ఇప్పటికే పాకిస్తాన్ లో బలూచిస్తాన్ కోసం ఉద్యమాలు చేస్తుంది. దీర్ఘకాలంగా పోరాటం చేస్తుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల తమంతట తాము బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. అంతటితో ఆగకుండా తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించింది. పాక్ ఆర్మీపై దాడులకు దిగుతూ నష్టాన్ని చేకూరుస్తున్నారు. గత కొన్నాళ్లుగా పాక్ లో ఈ ఉద్యమంతో ప్రభుత్వం అనేకరకాలుగా ఇబ్బందులు ఏర్పడుతుంది.
బలూచిస్తాన్ ఏర్పాటు చేయాలని...
పాక్ ఆర్మీ కూడా స్వదేశంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీతో యుద్ధం చేయలేక అవస్థలు పడుతుంది. పాక్ ఆర్మీ కనిపిస్తే చాలు బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులకు దిగుతుంది. పాక్ లోని క్వెట్టా, పంజ గుర్, కెచ్ వంటి ప్రాంతాలు మినహాయిస్తే ఎనభైవ శాతం బూచ్ ఫ్రాన్సిస్స్ పై పాక్ ప్రభుత్వానికి ఇప్పటికే అధికారం లేదు. ఇదిలా కొనసాగుతుంటే తాజాగా పాకిస్తాన్ లోని మరో ప్రాంతం నుంచి తమకు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ తో ఉద్యమం మొదలు పెట్టింది. సింధు ప్రావిన్స్ ప్రజలు కూడా రోడ్డెక్కి తమకు ప్రత్యేక దేశం కావాలని నినదిస్తున్నారు. సింధుదేశ్ కావాలంటూ ప్రదర్శనలతో్ పాటు నిరసనలకు దిగుతున్నారు. 1995 నుంచి ఈ డిమాండ్ ఉన్నా ఇప్పుడు అది తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రజలు కూడా తమను వేరుగా ప్రకటించుకున్నారు.
సింధూదేశ్ ఉద్యమంతో...
నిజానికి పాక్ ఇన్ని ముక్కలు కావడానికి అక్కడ ప్రభుత్వం, పాలకులు గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న పాలన కారణమంటున్నారు. ఇన్ని ముక్కలైతేప్రాకిస్తాన్ కు మిగిలేది ఏమీ ఉండదు. కేవలం పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే మిగిలి ఉంటుంది. రాజకీయ డామినేషన్ ఇక్కడి నుంచే ఉండటంతో ఉద్యమాలను కొంత అణిచి వేస్తున్నప్పటికీ ఎప్పటికైనా పాక్ కు అన్ని ప్రాంతాల నుంచి ఉద్యమ సెగ తప్పదని అంటున్నారు. ఇలాంటి ఉద్యమాలు పాక్ కు కొత్త కాకపోయినా అసలే ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్తాన్ కు ఒకవైపు భారత్ తీసుకున్న నిర్ణయాలు మరొకవైపు సొంత దేశంలో జరుగుతున్న పరిణామాలు మింగుడుపడనీయడం లేదు. మొత్తం మీద దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం తన ఇలాకాలోనే అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితులు తనంతట తానే కొని తెచ్చుకున్నట్లయింంది.
Next Story