Sat Mar 07 2026 21:20:11 GMT+0530 (India Standard Time)
నేడు ఇమ్రాన్ ఖాన్ రాజీనామా?
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేడు రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నేడు రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయన పై అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో ముందుగానే రాజీనామా చేయాలని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈరోజు ఇస్లామాబాద్ పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభను ఇమ్రాన్ ఖాన్ ఏర్పాటు చేశారు. ఈ సభలోనే తన రాజీనామా నిర్ణయాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించే అవకాశముంది.
ముందస్తు ఎన్నికల కోసం....
పాకిస్థాన్ లో సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది చివరలో జరగాల్సి ఉంది. అయితే అవిశ్వాస తీర్మానంలో తనకు బలం లేకపోవడంతో ముందుగానే రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారని తెలిసింది. ఈరోజు జరిగే సభలో ఆయన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.
- Tags
- imran khan
- resign
Next Story

