Tue Feb 03 2026 13:36:33 GMT+0000 (Coordinated Universal Time)
షియోమీకి చెందిన 5,551.27 కోట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ
వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న వేల కోట్ల రూపాయలను తాజాగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత్ లో షియోమీ 2014 నుంచి..

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీకి చెందిన రూ.5,551.27 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల మీద షియోమీపై ఫిబ్రవరి నెలలో ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న వేల కోట్ల రూపాయలను తాజాగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత్ లో షియోమీ 2014 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2015 నుంచి చెల్లింపులు చేస్తోంది. అయితే భారత్ లో వ్యాపారం నిర్వహిస్తూ, విదేశాల్లో ఉన్న మూడు సంస్థలకు రూ.5,551.27 కోట్ల విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని రాయల్టీ పేరుతో చెల్లించినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.
ఎంఐ బ్రాండ్ ఉత్పత్తులకు షియోమీ ఇండియా భారత్ లో ట్రేడర్, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ భారత్ లోని వివిధ తయారీదారుల నుంచి మొబైల్ ఫోన్లను సేకరించి ఎంఐ బ్రాండ్ కింద విక్రయిస్తోంది. విదేశాల్లో సదరు మూడు సంస్థల నుంచి ఎలాంటి సేవలను పొందడం లేదు. కానీ ఆ మూడు సంస్థలకు పెద్దమొత్తంలో విదేశీ మారక ద్రవ్య చెల్లింపులు చేస్తుండడంతో దానిపై ఈడీ దృష్టి సారించింది. తప్పుడు లావాదేవీల కోసం పొంతనలేని పత్రాలు రూపొందించడమే కాకుండా, రాయల్టీ పేరుతో సొమ్మును విదేశాలకు తరలిస్తూ ఫెమా చట్టంలోని సెక్షన్ 4 నిబంధన ఉల్లంఘించిందిందని ఈడీ చెబుతోంది.
Next Story

